Karnataka : కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఎటు చూసిన అన్ని పార్టీలోనూ ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీకి చెందిన యువనేత దారుణ హత్యకు గురికావడం కలకలం సృష్టిస్తోంది. ధార్వాడ నియోజకవర్గానికి చెందిన యువ మోర్చా నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు.