Bombay High Court: వివాహం తర్వాత భర్తతో ‘‘శృంగారానికి’’ నిరాకరించడం కూడా విడాకులకు కారణం కావచ్చని బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇది భర్త పట్ల క్రూరత్వానికి సమామని చెప్పింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థిస్తూ, భార్య పిటిషన్‌ని కొట్టేసింది. భర్తతో శారీరక సంబంధాన్ని తిరస్కరించడం, అతనితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించడం విడాకులకు కారణం కావచ్చని హైకోర్టు పేర్కొంది.
Bombay High Court: భార్యకు వివాహేత సంబంధం ఉందని ఓ భర్త కోర్టుకెక్కాడు. తన భార్యకు అక్రమ సంబంధం ఉందని చెబుతూ కొన్ని రికార్డింగ్స్‌ని కూడా కోర్టు ముందుంచారు. అయితే, ఈ కేసులో బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ సంచలన ఆదేశాలు ఇచ్చింది. భర్త చేసిన వాదనల్ని ధ్రువీకరించడానికి ‘‘వాయిస్ శాంపిల్స్’’ ఇవ్వాల్సిందిగా భార్యని ఆదేశించింది.