ఐపీఎల్ మ్యాచులంటేనే చివరిబంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ. అనూహ్య విజయాలు, ఓటముల్లో మాత్రం బెట్టింగ్‌ల కోసం ఫిక్సింగ్ చేశారనే టాక్ క్రికెట్ ఫ్యాన్స్ నుంచి సహజంగానే వినిపిస్తుంది. ఈ సీజన్‌లోనూ ఇలాంటి మ్యాచులు ఎక్కువే ఉన్నాయి. దీంతో కొన్ని మ్యాచుల్లో ప్లేయర్లు ఫిక్సింగ్‌కి పాల్పడి ఉంటారన్న అనుమానాలున్నాయి. ముంబై, జైపూర్ స్టేడియాల్లో బుకీలను గుర్తించి పోలీసులకు అప్పగించారన్న సమాచారంతో ఫిక్సింగ్ జరిగిందనే అనుమానాలు బలం చేకూరుతోంది.