గుంటూరులో కలకలం రేపుతోంది. కలుషిత నీరు సరఫరా కావడంతో డయేరియా విజృంభిస్తోంది. గడచిన నాలుగురోజులుగా డయేరియాతో బాధపడుతున్న వారు ఆస్పత్రిలో చేరుతున్నారు. డయేరియాతో ఒకరు చనిపోగా.. మరో 30 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుంటూరు కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యమే డయేరియా ప్రబలడానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని స్పందించారు. గుంటూరులో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు, అనారోగ్యం బారిన పడ్డారని.. అనారోగ్యానికి గురైన వారందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు.…