Mass Jathara : అక్టోబర్ 31న రెండు భారీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. బాహుబలి రెండు పార్టులను కలిపి ఒకే పార్టు కింద బాహుబలి ది ఎపిక్ పేరుతో రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అదే రోజు మాస్ మహారాజ రవితేజ నటించిన మాస్ జాతర సినిమాను రిలీజ్ చేస్తున్నారు. బాహుబలికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అసలే ఎవర్ గ్రీన్ మూవీ. తెలుగు సినిమా గతిని మార్చిన సినిమా. అందులోనూ రెండు పార్టులు…