Home
Masoud Pezeshkian
Masoud Pezeshkian News
-
Iran: సుప్రీం లీడర్‌తో మాట్లాడటం కష్టమే.. ఇరాన్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
Iran: ఇరాన్-అమెరికా యుద్ధం నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌కు ఆ దేశ సైన్యానికి మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తల నేపథ్యంలో పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో ప్రస్తుతం నేరుగా సంప్రదింపులు జరపడం చాలా కష్టంగా మారిందని అన్నారు. అయితే, దేశానికి ఆయన నాయకత్వం ఇప్పటికీ గొప్ప బలమని కొనియాడారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయిల్ సంయుక్తంగా జరిపిన దాడిలో అప్పటి ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. అదే… -
Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
Iran Political Crisis: అమెరికా – ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఇరాన్లో అంతర్గత రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. దేశంలో అధికారాన్ని కైవసం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వార్తలు జోరందుకున్నాయి. ఇదే సమయంలో దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చిపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అమెరికాతో చర్చలు జరిపి ఒప్పందానికి రావడం ద్వారా ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థను బలహీనపర్చే “సాఫ్ట్ తఖ్తాపలట్ (Soft Coup)”కు పాల్పడుతున్నారని ఇరాన్‌లోని కట్టరపంథీయ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.… -
US-Iran War: ప్రభుత్వం vs మిలిటరీ.. హార్ముజ్ అంశంపై ఇరాన్లో అంతర్గత విభేదాలు..
US-Iran War: అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధి విషయంలో ఇప్పుడు ఇరాన్లో అంతర్గత విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కి, ఎన్నికైన ప్రజా ప్రభుత్వానికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి. IRGCకి చెందిన కఠిన వైఖరి గల కమాండర్లు, హోర్ముజ్ జలసంధిపై తమ నియంత్రణను ఏ విధంగానైనా కాపాడుకోవాలని, అమెరికాకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించాలని కోరుకుంటుండగా, అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ నేతృత్వంలోని… -
Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
ఎవరైనా విదేశీ అతిథులు వచ్చినప్పుడు చాలా గౌరవంగా.. రెడ్ కార్పె్ట్ వేసి ఘనంగా స్వాగతం పలుకుతారు. కానీ పాకిస్థాన్‌లో ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాత్రం చాలా వింతగా ప్రవర్తించారు. -
Iran invites PM Modi: ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకండి.. మోడీకి ఇరాన్ ఆహ్వానం..
Iran invites PM Modi: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకావాలని ప్రధాని నరేంద్ర మోడీకి ఇరాన్ ఆహ్వానం పలికింది. ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ ఈ మేరకు ఆహ్వానించినట్లు సమాచారం. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయిల్ దాడుల్లో ఖమేనీ మరణించారు. ఆయన అంత్యక్రియలు జూలై 4న ప్రారంభమై, ఇరాన్ పవిత్ర నగరంగా ఉన్న మషాద్‌లో జూలై 9న ఆయనను ఖననం చేయడంతో ముగుస్తాయి. ఖమేనీ స్వస్థలం కూడా మషాద్ నగరమే. 86… -
US-Iran peace deal: మేము అణు బాంబు తయారు చేయం.. ఇరాన్ సంచలన ప్రకటన..
US-Iran peace deal: స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం కుదిరేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆయన బృందం, ఇరాన్ తరుఫున స్పీకర్ మొహ్మమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్, విదేశాంగ మంత్రి అఘర్చీ ఆ దేశానికి చేరారు. మధ్యవర్తులుగా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ఖతార్ ప్రతినిధులు స్విట్జర్లాండ్ వెళ్లారు. తాజాగా ఒప్పందానికి సంబంధించిన కీలక విషయాలను ఇరాన్ అద్యక్షుడు మహ్మద్ పెజెష్కియాన్ వివరించారు. పెజెష్కియాన్ మాట్లాడుతూ..… -
Mojtaba Khamenei: “ఆయన హామీతోనే ఓకే చెప్పా”.. అమెరికా-ఇరాన్ డీల్‌పై సుప్రీంలీడర్ షాకింగ్ కామెంట్స్..
Mojtaba Khamenei: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న సుదీర్ఘ ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఇరు దేశాలు ఓ అవగాహన ఒప్పందం (MoU) పై సంతకాలు చేసిన మరుసటి రోజే అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నేరుగా లక్ష్యంగా చేసుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ఈ ఒప్పందం కోసం ఎంతో నిరాశగా (desperate) ఎదురుచూశారని, దీనిని సాధించడం కోసం తన వద్ద… -
Who Rules Iran: ఇరాన్లో అసలు అధికారం ఎవరి చేతుల్లో ఉంది? భారత నౌకలపై కాల్పులతో పెరుగుతున్న ఉత్కంఠ!
Who Rules Iran: మిడిల్ ఈస్ట్ (మధ్యప్రాచ్యం)లో ప్రస్తుతం యుద్ధ మేఘాలు ఏ దిశగా సాగుతున్నాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. శనివారం వ్యూహాత్మక ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ (హోర్ముజ్ జలసంధి) గుండా ప్రయాణిస్తున్న రెండు భారతీయ నౌకలపై ఇరాన్ దళాలు కాల్పులు జరపడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఈ ఘటన ఇరాన్ అంతర్గత అధికార పోరాటాన్ని బహిర్గతం చేయడమే కాకుండా, ఆ దేశాన్ని అసలు ఎవరు నడిపిస్తున్నారనే సందేహాలను పెంచుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. READ ALSO: SRH… -
Iran: పేరుకు మాత్రమే ఇరాన్ అధ్యక్షుడు.. ఇప్పుడు అధికారం అంతా వారిదే..
Iran: ఇరాన్ యుద్ధం ప్రారంభమైన నెల రోజులు గడిచింది. అయినప్పటికీ, ఇప్పటికీ యుద్ధం తీవ్రస్థాయిలోనే కొనసాగుతోంది. యుద్ధం తర్వాత చమురు రవాణాకు కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకుని నియంత్రిస్తోంది. యుద్ధం ప్రారంభమైన తొలి రోజే అప్పటి సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ హత్య చేయబడ్డాడు. ఇక ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ తదుపరి సుప్రీంలీడర్‌గా ఎన్నికయ్యారు. అయితే, ఆయన కూడా యూఎస్-ఇజ్రాయిల్ దాడిలో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అతడి… -
Iran War: ఇరాన్ యుద్ధం, మధ్యవర్తిగా పాకిస్తాన్.. ఇస్లామాబాద్‌లో చర్చలు..!
Iran War: మిడిల్ ఈస్ట్ యుద్ధం మూడో వారానికి చేరింది. ఇప్పటికీ ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. మరోవైపు ఇరాన్ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఇజ్రాయిల్‌తో పాటు గల్ఫ్ లోని సౌదీ అరేబియా, కువైట్, బహ్రైయిన్, ఖతార్, యూఏఈలపై దాడులు చేస్తూనే ఉంది. ఇక చమురు సరఫరాకు అత్యంత కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ తన కంట్రోల్‌కి తీసుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది.
తాజావార్తలు
-
Jupally Krishna Rao: ‘రాష్ట్రంలో నీటి కటకట ఉంది.. అంతటా ఎల్‌నినో ప్రభావం’..
-
Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్‌కు స్పష్టం చేసిన భారత్..
-
Vishwanath and Sons Trailer: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ టాక్.. సూర్య-మమితా కెమిస్ట్రీ అదుర్స్.!
-
Modi-Shinde: ప్రధాని మోడీతో ఏక్నాథ్ షిండే భేటీ.. సరికొత్త ఊహాగానాలు
-
Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!