State Bank of India : దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మార్కెట్ వాల్యుయేషన్‌లో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ను అధిగమించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా SBI దేశంలో 5వ అతిపెద్ద సంస్థగా అవతరించింది.
Today (13-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్‌కి ఈ వారం శుభారంభం లభించలేదు. గ్లోబల్ మార్కెట్ నుంచి ప్రతికూల సంకేతాలు అందటంతో రెండు కీలక సూచీలు కూడా ఇవాళ సోమవారం ఉదయం ఫ్లాట్‌గానే ప్రారంభమై కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఇండియా మరియు అమెరికాలో కీలకమైన ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు ముందుజాగ్రత్త పాటించారు.
గతవారం దేశీయంగా స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యాయి. అమెరికా ద్రవ్యోల్బణం, ఫెడ్ రెట్లు వంటి అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. దేశీయంగా టాప్ లిస్టులో ఉన్న కంపెనీలలో రిలయన్స్ మినహా మిగతా అన్ని కంపెనీలు భారీ నష్టాలను చవిచూశాయి. గతవారం టాప్ 9 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,03,532.08 కోట్ల మేర క్షీణించింది. టీసీఎస్ భారీగా నష్టపోగా, టాప్‌లో ఉన్న రిలయన్స్ మాత్రం భారీగా లాభపడింది. Read: Job: వర్క్‌ఫ్రమ్ హోమ్ చేస్తూ…