అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇంట్లో ఎఫ్‌బీఐ దాడులు నిర్వహించింది. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ఉన్న మార్-ఎ-లాగో ఎస్టేట్‌లో ఆయన నివాసంపై సోదాలు జరిపింది. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. తన ఇంట్లోకి అధికారులు బలవంతంగా చొరబడ్డారని, ఇలాంటి దాడులు వెనకబడిన దేశాల్లోనే జరుగుతాయని ధ్వజమెత్తారు.