Banswada Mother Murder: కన్న తల్లి ఆ కొడుక్కి… భారం అయ్యింది. వృద్దాప్యంలో ఆమెకు సపర్యలు చేయడం భారంగా భావించిన ఆ కసాయి కొడుకు .. నవమాసాలు మోసిన కన్న తల్లిని కడతేర్చాడు. కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన కలకలం సృష్టించింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లంలో దారుణ ఘటన జరిగింది. బొర్లానికి చెందిన సాయవ్వ తన ఒక్కగానొక్క కొడుకు బాలయ్యతో.. కలిసి ఉంటోంది. బాలయ్య వ్యవసాయ కూలీగా పనిచేస్తుండగా.. సాయవ్వ అనారోగ్యంతో ఇంట్లో మంచానికి…