మణిపూర్ నోనీ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. బుధవారం రాత్రి నోని జిల్లాలోని టెరిటోరియల్ ఆర్మీ క్యాంప్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో జవాన్లతో పాటు ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. శనివారానికి మరణించిన వారి సంఖ్య 20కి చేరింది. మృతుల్లో 15 మంది జవాన్లు ఉన్నారు. ఇప్పటి వరకు ఆర్మీకి చెందిన 13 మంది సిబ్బందిని ఐదుగురు ప్రజలను రెస్క్యూ చేశారు. మరో 44 మంది కనిపించకుండా పోయారు. వీరంతా…
మణిపూర్ రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు 14 మంది మరణించారు. మరో 60 మంది దాకా చిక్కుపోయినట్లు అదికారులు అనుమానిస్తున్నారు. చాలా మంది ఇంకా శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. మణిపూర్ డీజీపీ పి డౌంగెల్ మాట్లాడుతూ.. 23 మందిని కొండచరియల కింద నుంచి బయటకు తీయగా 14 మంది మరణించారని వెల్లడించారు. ఇండియన్ ఆర్మీతో పాటు అస్సాం రైఫిల్స్, టెరిటోరియల్ ఆర్మీ దళాలు ఘటన జరిగినప్పటి నుంచి రెస్క్యూ చర్యలు కొనసాగిస్తున్నారు. సైన్యం,…