వేసవికాలం వచ్చిందంటే చాలు.. మామిడి పండ్ల హంగామా మొదలైపోతుంది. రాక రాక ఏడాదికి ఒకసారే మార్కెట్‌లోకి వస్తాయి కాబట్టి, మామిడి ప్రియులు వీటిని కొనుగోలు చేసేందుకు ఎగబడతారు. అంత, ఇంత అని మోతాదు చూసుకోకుండా.. ఎక్కువ స్థాయిలో తినేస్తారు. మరి, ఇలా విరగబడి తినడం కరెక్టేనా? ఆరోగ్యానికి మంచిదేనా? అంటే.. అవుననే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎన్ని ఎక్కువ తిన్నా, వీటి వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవని చెప్తున్నారు. ఈ పండ్లలో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో పౌషకాలు…