Rameshwaram Cafe Blast: బెంగళూర్ నగరంలోని రామేశ్వరం కేఫ్ పేలుడు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన బాంబు పేలుడులో 10 మంది గాయపడ్డారు. పథకం ప్రకారమే నిందితుడు ఐఈడీ బాంబుకు టైమర్‌ని అమర్చి పేల్చినట్లు తెలుస్తోంది. 2022 మంగళూర్‌లో జరిగిన ప్రెషర్ కుక్కర్ పేలుడుకు, తాజాగా జరిగిన బెంగళూర్ పేలుడుకు మధ్య సంబంధం ఉందని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ శనివారం అన్నారు. బెంగళూర్ లోని…