మంచు ఫ్యామిలీలో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. కొన్నాళ్ల క్రితం నుంచి వీరి వివాదాలు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. తాజాగా, మంచు మనోజ్ తన సోదరుడు మంచు విష్ణుపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదులో మనోజ్ సంచలన ఆరోపణలు చేస్తూ, తన ఇంట్లో విలువైన వస్తువులు, కార్లు దొంగిలించబడ్డాయని, జల్‌పల్లిలోని తన నివాసంలో విధ్వంసం జరిగిందని పేర్కొన్నాడు. ఈ ఘటనల వెనుక తన సోదరుడు విష్ణు ఉన్నాడని ఆరోపిస్తూ, పోలీసులను న్యాయం చేయాలని కోరాడు.…