మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తుండటంతో ఈ సక్సెస్ మ్యాజిక్ ఇక్కడితో ఆగిపోకూడదని మెగాస్టార్ గట్టిగా నిశ్చయించుకున్నట్లు కనిపిస్తోంది. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి భారీ హిట్లు అందుకున్నప్పటికీ, ఆయనలోని వింటేజ్ గ్రేస్‌ను, ఆ కామెడీ టైమింగ్‌ను వెలికితీసిన క్రెడిట్ అనిల్ రావిపూడికే దక్కింది. సినిమా…