Maharashtra: మహారాష్ట్రలో దారుణం జరిగింది. కారు అపమన్నందుకు, ఏకంగా ట్రాఫిక్ పోలీసును దాదాపుగా కారుపై 10 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డ్రగ్స్ మత్తులో ఉన్న ఓ వ్యక్తి తన కారు విండ్ షీల్డ్ పై ట్రాఫిక్ కానిస్టేబుల్ ను 10 కిలోమీటర్లు తీసుకెళ్లాడు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఘటన జరిగింది.