Mumbai Court: మహిళ అణుకువకు భంగం కలిగించడం, వారితో వెక్కిలిగా ప్రవర్తించడం కూడా తీవ్ర శిక్షార్హమైన నేరమే. ముంబైకి చెందిన ఓ వ్యక్తి, ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఆమెను చూసి కన్నుకొట్టిన నేరంలో దోషిగా నిర్ధారించబడ్డాడు. అయితే, యావజ్జీవ శిక్ష తప్పదని భావించినప్పటికీ, అతడికి ఎలాంటి నేర చరిత్ర లేకపోవడం, అతడి వయసు కారణంగా ప్రొబేషన్ బెనిఫిట్ ఇవ్వాలని ముంబై కోర్టుమేజిస్ట్రేట్ ఆర్తి కులకర్ణి అభిప్రాయపడ్డారు.