ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఒక్క వీడియో వైరల్ అయితే చాలు స్టార్ అయిపోవచ్చు. ఇక ఫాలోవర్లు అధికంగా ఉంటే.. ప్రమోషన్లతో బోలెడంత డబ్బు సంపాదించ్చు. అందుకే చాలా మంది వైరైటీగా వీడియోలు, రీల్స్ చేయాలని చూస్తున్నారు. అయితే ఆ వైరైటీనే ప్రాణాలు కోల్పోయేలా చేస్తోంది. తాజాగా ఓ యువకుడు ఫేమ్, మనీ కోసం.. ఏకంగా నాగుపామును నోట్లో పెట్టుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం…