సినీ ప్రమోషన్స్ లో సమన్వయ లోపం ఒక్కోసారి ఊహించని ఇబ్బందులకు దారితీస్తుంది. తాజాగా కన్నడ చిత్రం ‘కొరగజ్జ’ బృందానికి కేరళలోని కొచ్చిలో ఇటువంటి అనుభవమే ఎదురైంది. షెడ్యూల్ పరంగా తలెత్తిన గందరగోళం కారణంగా ఈ సినిమా ప్రెస్‌మీట్ అర్ధాంతరంగా వాయిదా పడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ‘కొరగజ్జ’ ప్రెస్ మీట్ కొచ్చిలోని హోటల్‌లో నిర్వహించాలని యూనిట్ ముందే నిర్ణయించింది. దీనికోసం వారం రోజుల ముందే మీడియా ప్రతినిధులకు ఆహ్వానాలు కూడా పంపారు. అయితే, అదే రోజు, అదే సమయానికి…