Off The Record: మల్కాజిగిరి నియోజకవర్గం మినీ ఇండియా లాంటిది. అన్ని వర్గాల ప్రజలుండే మల్కాజిగిరికి తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయ పార్టీలు ఈ నియోజకవర్గాన్ని తేలికగా తీసుకోవు. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు 2014, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా, 2019లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా ఆయన నిలబెట్టుకోలేకపోయారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి మల్కాజిగిరి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని రామచందర్ రావు చూస్తున్నారట.…