యంగ్ హీరో అడివి శేష్ టాలీవుడ్ లో విభిన్న సినిమాలతో ప్రత్యేకతను చాటుకున్న నటులలో ఒకరు. క్షణం, గూడాచారి వంటి సినిమాలతో పరిమిత బడ్జెట్‌తోనే హిట్ కొట్టి మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. అయితే తాజాగా ఈ యంగ్ హీరోకు గోల్డెన్ ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల మీడియాతో ఇంటరాక్ట్ అయిన శేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడుతూ తనకు బాలీవుడ్ సినిమాల్లో ఆఫర్ వచ్చిందని స్వయంగా వెల్లడించాడు. “నేను నా నెక్స్ట్ రెండు హిందీ చిత్రాలకు…