తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్లను అమాంతం పెంచేయడం వల్ల, సాధారణ ఆడియన్స్ థియేటర్లకు రావడం చాలావరకు తగ్గించేశారు. ఈ దెబ్బకు.. కలెక్షన్ల పరంగా చాలా చిత్రాలు ప్రభావితం అయ్యాయి. చాలా థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి. ఇది గమనించిన మన మేకర్స్.. టికెట్ రేట్ల విషయమై తలొగ్గుతున్నారు. ఆల్రెడీ ఎఫ్3 సినిమాకు సాధారణ టికెట్ రేట్లే పెడుతున్నామని నిర్మాత దిల్‌రాజు ప్రకటించేశారు. ఇప్పుడు మేజర్ సినిమాకీ సాధరణ రేట్లకే టికెట్లు అందుబాటులో ఉంటాయని హీరో అడివి శేష్…