Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నాయకురాలు మహువా మొయిత్రాపై 'క్యాష్ ఫర్ క్వెరీ' ఆరోపణలకు సంబంధించిన ఎథిక్స్ కమిటీ నివేదికను అనుసరించి లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు. 49 ఏళ్ల మహువా మోయిత్రా లోక్‌సభలో ప్రధాని నరేంద్రమోడీ, వ్యాపారవేత్త అదానీలను టార్గెట్ చేస్తూ ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వ్యాపారవేత్త దర్శన్ హీరా నందానీ నుంచి డబ్బులు తీసుకున్నారని ఆరోపణల నేపథ్యంలో ఆమెపై ఎథిక్స్ కమిటీ విచారణ జరిపి, బహిష్కరించాలని సిఫారసు చేసింది.