Anti Hijab Protest In Iran: ఇరాన్ దేశంలో హిజాబ్ వ్యతిరేక నిరసనలు రోజురోజుకు తీవ్రం అవుతున్నాయి. నాలుగు వారాలుగా అక్కడి యువత, మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 22 ఏళ్ల మహ్సా అమిని అనే యువతిని హిజాబ్ ధరించలేదని అక్కడి మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేసిన కొద్ది రోజులకే ఆమె మరణించింది. దీంతో అప్పటి నుంచి అక్కడి మహిళలు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. మహిళలు హిజాబ్ తీసేసి, జట్టు కత్తిరించుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ…
Anti-Hijab Protests in iran: ఇరాన్ లో పది రోజులుగా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. హిజాబ్ సరిగ్గా ధరించలేదని చెబుతూ.. మోరాలిటీ పోలీసులు మహ్సాఅమిని అనే 22 ఏళ్ల యువతిని అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆమె కోమాలోకి వెళ్లి మరణించింది. పోలీసులు దాడి చేయడంతోనే ఆమె మరణించిందని ఆరోపిస్తూ.. దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. యువత, మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. మహిళలు హిజాబ్ తీసేస్తూ.. జట్టు కత్తిరించుకుంటూ నిరసనల్లో పాల్గొంటున్నారు.
Hijab Protest In Iran:ఇరాన్ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మహ్స అమిని అనే మహిళ హిజాబ్ వేసుకోనందుకు మోరాలిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత గత శుక్రవారం ఆమె మరణించింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా మహిళలు, యువత హిజాబ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. హిజాబ్ తీసువేస్తూ.. జట్టు కత్తిరించుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తన ఆందోళనలు చేస్తున్నారు.