బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ శుక్రవారం ప్రధాని మోడీ మహిళా రోజ్‌గర్ యోజన పథకాన్ని ప్రారంభించి 75 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ. 10,000 జమ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. తానూ.. నితీష్ కుమార్ బీహార్ అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు పని చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ మహిళలకు దసరా కానుక అందింది. శుక్రవారం ప్రధాని మోడీ మహిళా రోజ్‌గార్ యోజన పథకాన్ని ప్రారంభించారు. వర్చువల్‌గా ఈ పథకాన్ని ప్రారంభించారు. దీంతో 75 లక్షల మంది మహిళలకు రూ.10,000 చొప్పున ఖాతాల్లో జమయ్యాయి. మహిళా సాధికారత, స్వయం ఉపాధి కల్పించే దిశగా రూ.7,500 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించారు.