టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన రిటైర్మెంట్ లైఫ్ గురించి సరదాగా ముచ్చటించారు. హైదరాబాద్‌లో జరిగిన ‘టాలీవుడ్ ప్రో లీగ్’ (TPL) ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన, క్రికెట్ నుండి తప్పుకున్నాక ఏం చేస్తున్నారో చెప్పారు.. ముఖ్యంగా తెలుగు సినిమాలపై తనకున్న ఇష్టాన్ని సరదాగా పంచుకున్నారు.. వీరేంద్ర మాట్లాడుతూ.. ‘క్రికెట్ ఫార్మాట్లు, ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యాక ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నిజం చెప్పాలంటే.. ఇప్పుడు నాకు వేరే పని ఏమీ లేదు,…