Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మనసు సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయింది నిహారిక. మెగా కుటుంబం నుంచి మొట్టమొదటి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక దారుణంగా విఫలమైంది. దీంతో ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది.
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల విడాకులు తీసుకున్నాకా మరింత ఫేమస్ అయ్యింది. చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించిన్నప్పటి నుంచి ఆమె పేరు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తుంది. నిహారికనే ముందు విడాకులు అడిగిందని, భరణం అడిగిందని, చైతన్య తండ్రి ఆమె గురించి మాట్లాడాడు అని ఏవేవో కథనాలు అల్లేస్తున్నారు.