ఆరుగాలం కష్టపడి పండిస్తున్న రైతన్నకు నష్టాలే మిగులుతున్నా యి. ఓ వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం.. మరోవైపు అకాల వర్షాలతో కన్నీళ్లే మిగులుతున్నాయి. దేశాన్ని ఎప్పుడూ ఆకలితో పడుకోనివ్వని రైతు ప్రకృతి ముందు కూడా నిస్సహాయుడవుతున్నాడు. చలి, వేడి, ఎండ, వానలను భరించి తాను పండించిన పంటను మార్కెట్‌కు తరలిస్తే అక్కడ కూడా పంటకు రక్షణ లేకుండా పోతోంది. అకాల వర్షాల వల్ల వారి పంటలు కొట్టుకుపోతే.. ఆ అన్నదాత ఎంత ఆవేదనకు గురవుతాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.…
మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. అయితే బుధవారం ముంబై, పూణెలాంటి నగరాలను భారీ వరద ముంచెత్తింది. ఇళ్లు, దేవాలయాలు, కార్లు మునిగిపోయాయి.
Landslide: మహారాష్ట్రలోని రాయగఢ్‌లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అర్థరాత్రి జరిగిన ఈ పెను ప్రమాదంలో 30కి పైగా కుటుంబాలు శిథిలాల కింద సమాధి అయ్యాయని భయాందోళన చెందుతున్నారు.