CM Nitish Kumar: బీహార్ లోని ‘మహాగటబంధన్’ కూటమిలో లుకలుకలు ఏర్పడ్డాయి. మాజీ సీఎం జీతన్ రామ్ మాంఝీపై ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ ఆరోపణలు ఎక్కుపెట్టారు. మాంఝీ కూటమి విషయాలను బీజేపీకి లీక్ చేస్తున్నట్లు ఆరోపించారు. మాంఝీని ముందు ఈ నెల 23న జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశంలో పాల్గొనాలని నితీష్ కోరారు.
Nitish Kumar hints at power transfer to Tejashwi Yadav in future: బీజేపీ పొత్తును కాదని.. జేడీయూ అధినేత, బీహాార్ సీఎం నితీష్ కుమార్, మరోసారి లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీతో జతకట్టారు. బీజేపీతో పొత్తు తెగదెంపులు చేసుకుని, ఆర్జేడీతో కలిసి మహాఘటబంధన్ కూటమిని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే సీఎం నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆర్జేడీ నేత, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కు అధికార…
బిహార్‌లో కొత్తగా ఏర్పడిన సర్కారు బలపరీక్షకు ముందే కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా తనపై అధికార 'మహాగట్బంధన్' (మహాకూటమి) ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై వేదన వ్యక్తం చేస్తూ భావోద్వేగంతో కూడిన ప్రసంగం అనంతరం సభా వేదికపై తన రాజీనామాను ప్రకటించారు.
బిహార్ రాజకీయాల్లో మరోసారి కీలక మలుపు చోటుచేసుకుంది. బీజేపీకి రెండోసారి షాక్ ఇస్తూ ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ బయటకు వచ్చేసింది. ఇప్పటివరకు ప్రత్యర్థులుగా ఉన్న ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో చేతులు కలిపింది. ఆ పార్టీలతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఏర్పాటు చేయనున్నారు.