Home Rents: రోజులు మారుతున్నాయి. పరిస్థితులు కుదుటపడుతున్నాయి. మన దేశంలోని వివిధ రంగాల్లో మళ్లీ కరోనా ముందు నాటి సానుకూల వాతావరణం ఏర్పడుతోంది. అద్దె ఇళ్ల మార్కెట్ దీనికి చక్కని ఉదాహరణగా నిలుస్తోంది. కొవిడ్ నేపథ్యంలో సొంత ఊళ్లకు వెళ్లినవాళ్లు ఇప్పుడు క్రమంగా నగరాలకు చేరుకుంటున్నారు. కార్యాలయాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. దీంతో సిటీల్లో అద్దెకు ఉండేవాళ్ల సంఖ్య పెరుగుతోంది.