భారతదేశంలో విశ్వవిఖ్యాత దర్శకసార్వభౌముడు ఎవరైనా ఉన్నారంటే అది సత్యజిత్ రే మాత్రమేనని అందరూ అంగీకరిస్తారు. సత్యజిత్ రే సినిమాలతోనే భారతీయ ఆత్మ దేశవిదేశాల్లోని సినీప్రియులను ఆకట్టుకుంది. ‘రే’ పేరులో వెలుగు రేఖ ఉన్నట్టే, ఆయన ప్రతిభాపాటవాల కారణంగానే భారతీయ సినిమా ప్రపంచ యవనికపై వెలుగు చూసింది. ఏం, అంతకు ముందు సత్యజిత్ రే కంటే మించిన దర్శకులు లేరా? అంటే నిస్సందేహంగా లేరనే చెప్పాలి. ఆయన కంటే ముందు ఎందరో దర్శకులు అఖండ విజయాలను సాధించారు. అయితే…