జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల ఏపీ మంత్రి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. మాగంటి అకాల మరణం బాధాకరమన్నారు. తెలుగుదేశం పార్టీతోనే మాగంటి గోపీనాథ్ గారి రాజకీయ ప్రస్థానం మొదలైందని గుర్తు చేశారు. మాగంటి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. మాగంటి కుటుంబ సభ్యులకు నారా లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాగంటి గోపీనాథ్ ఈరోజు కన్నుమూశారు. ఈనెల 5న ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్చించారు. ఆస్పత్రిలో…