ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది ఒకసారి.. ఓడింది రెండుసార్లు. పార్టీ అవకాశం ఇచ్చినా నెగ్గుకు రాలేకపోయారు. ఇప్పుడు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి మూడు ముక్కలాటలా తయారైంది. ఈసారి కష్టమని భావించారో ఏమో ఇంకో నియోజకవర్గంపై కర్చీఫ్ వేయాలని చూస్తున్నారట. దీంతో ఆయనకు పార్టీ ఛాన్స్ ఇస్తుందా లేక.. షాక్ ఇస్తుందా? అనే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరాయన? మాడుగుల టీడీపీలో గ్రూప్ ఫైట్! విశాఖ జిల్లా మాడుగుల. టీడీపీ ఆవిర్భావం తర్వాత మాడుగుల నియోజకవర్గంలో తొమ్మిదిసార్లు ఎన్నికలు జరిగితే…