Madhu Bala: నా చెలి రోజావే అన్నా.. పరువం వానగా నేడు కురిసిందిలే అన్నా.. కళ్ళముందు ఒకే ఒక్క రూపం కదలాడుతూ ఉంటుంది. ఆమె రోజా.. అదేనండీ మధుబాల. అందం, అభినయం కలబోసిన రూపం. ఒక్క సినిమాతో ఇండస్ట్రీని ఏలిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం రీ ఎంట్రీలో కూడా అదరగొడుతుంది. మధుబాల పూర్తి పేరు.. మధూ షా. 1991 లో ఆమె తన కెరీర్ ను మొదలుపెట్టింది.
Madhu Bala: మధుబాల.. ఇప్పటితరానికి ఆమె అందం గురించి తెలియదు. కానీ, 90s కిడ్స్ ను అడిగితే ఆమెను ఎంతగా ఆరాదించేవారో చెప్పుకొస్తారు. రోజా చిత్రంలో పరువం వానగా అంటూ ఆమె ఆ వానలో తడుస్తుంటే అభిమానుల గుండెలు జారిపోయేవి.