శత్రువును దెబ్బతీయడానికి రాజకీయాలలో రకరకాల ఎత్తులు వేస్తుంటారు. ప్రత్యర్థిపార్టీలే కాదు.. సొంత పార్టీ నేతలనూ.. ఇందుకు మినహాయింపు ఇవ్వట్లేదు ఓ నేత వర్గం. పట్టు నిలుపుకోవడానికి.. వర్గాన్ని కాపాడుకోవడానికి.. సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించి.. ప్రత్యర్థి శిబిరాన్ని వీక్ చేసే పనిలో పడ్డారట. గుంటూరు పశ్చిమలో రెండోసారి ఎమ్మెల్యేగా గెలవలేరా? రాజకీయాల్లో సెంటిమెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు రాజకీయ నాయకులు. కలిసొచ్చే అంశాలను అస్సలు వదులుకోరు. కలిసిరాదన్నచోట కలవరపాటు కామన్. ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఆ సెంటిమెంటే…