(మే 1న ‘ఎర్రమల్లెలు’కు 40 ఏళ్లు)తొలి నుంచీ అభ్యుదయ భావాలు కలిగి, వామపక్ష ఆదర్శాల నీడన మసలారు నటుడు, నిర్మాత, దర్శకుడు మాదాల రంగారావు. ఆరంభంలో చిన్న చిన్న పాత్రల్లో తెరపై కనిపించిన మాదాల రంగారావు తరువాత మిత్రులతో కలసి నవతరం పిక్చర్స్ నెలకొల్పారు. ప్రముఖ నిర్మాత పోకూరి బాబూరావు, దర్శకుడు టి.కృష్ణ వంటివారు ఈ ‘నవతరం’ నీడలో నిలచిన వారే. తొలి ప్రయత్నంగా మాదాల రంగారావు నిర్మించి, నటించిన ‘యువతరం కదిలింది’ చిత్రం మంచి విజయం…