విశాల్ హీరోగా వరలక్ష్మి, అంజలి హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం మద గజ రాజా. కామెడీ సినిమాలతో పాటు హారర్ సినిమాలు బాగా చేస్తాడనే పేరు ఉన్న దర్శకుడు సి సుందర్ దర్శకత్వంలో ఈ సినిమా దాదాపు 12 ఏళ్ల క్రితం రూపొందింది. అయితే అనేక కారణాలతో ఈ సినిమా అప్పుడు విడుదలకు నోచుకోలేదు. అయితే తాజాగా ఈ సినిమాని సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో రిలీజ్ చేస్తే మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి.…