పేర్ని నాని భార్య కేసులో ఏ1 జయసుధ తరఫు న్యాయవాదులు తమ వాదన వినిపిస్తూ.. గోడౌన్‌లో బస్తాల షార్టేజ్ వచ్చినట్లు గుర్తించి.. నవంబర్ 27వ తేదీన ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు.. అయితే, డిసెంబర్ 3, 4 తేదీల్లో గోడౌన్లో తనిఖీలు నిర్వహించి.. 10వ తేదీన డిమాండ్ నోటీసు ఇచ్చారని కోర్టుకు వివరించారు. అనంతరం డిసెంబర్ 12వ తేదీన కేసు నమోదు చేశారని కోర్టుకు విన్నవించారు. బియ్యం తగ్గిన విషయం తామే ముందు గుర్తించి ప్రభుత్వానికి చెప్పామని తెలిపారు..