పల్నాడు జిల్లాలోని మాచర్లలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ నిర్వహిస్తున్న రాష్ట్రానికి ఇదేం కర్మ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణుల యత్నించడంతో ఈ గొడవ ప్రారంభమైంది.
మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో టీడీపీ నేత చంద్రయ్య మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. చంద్రయ్య మృతదేహం గుండ్లపాడుకు తరలించారు. గుండ్లపాడుకు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నేతలు. గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్యను ప్రత్యర్థులు నరికి చంపారు. చంద్రయ్య గ్రామ సెంటర్‌లో కూర్చుని ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. హత్య అనంతరం ప్రత్యర్థులు పరారయ్యారు. చంద్రయ్య హత్యను చంద్రబాబు ఖండించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.చంద్రయ్య హత్య బాధాకరమన్నారు. అధికారం ఎవ్వరికి శాశ్వతం…