Minister Roja: 2024లోనూ జగనన్న వన్స్ మోర్ అంటున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పల్నాడు జిల్లాలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ఊపుమీద సాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు,, ఇన్‌చార్జ్‌లు, సమన్వయకర్తలు, కన్వీనర్లు, గృహ సారథులు, వలంటీర్లు కలసికట్టుగా ఇంటింటికీ వెళ్తున్నారు. జగనన్న ప్రతినిధులుగా వచ్చిన వీరందరినీ.. తమ ఇంటికి బంధువులొచ్చినంత సంబరంగా ప్రజలు చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నారు. తమ ఇళ్ల వద్దకు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నారు. కొన్ని ఊళ్లలో మేళతాళాలతో ఎదురేగి ఘన స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పడుతున్నారు.‘ఎమ్మెల్యే వద్దకు ప్రజలు వెళ్లడం సాధారణంగా జరిగేది. కానీ అందుకు విరుద్దంగా ప్రజల వద్దకే మంత్రులు, ఎమ్మెల్యేలు రావడం అంటే అది కేవలం ఒక్క జగనన్న వల్లే సాధ్యమైంది’ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారని వైసీపీ నేతలే చెబుతున్నారు.

Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
Read Also: Jagananna Maa Bhavishyathu: 175 నియోజకవర్గాల్లో ఉద్యమంలా జగనన్నే మా భవిష్యత్తు
జగనన్నే మా భవిష్యత్ అనే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రోజా కామెంట్లు చేశారు. విపక్షాలపై ఆమె మండిపడ్డారు. 2024 లో జగనన్నను వన్స్ మోర్ అంటూ ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన 16 మంది ముఖ్యమంత్రు ల కన్నా మిన్నగా పాలిస్తున్నాడు జగనన్న…అలాంటి జగన్ పై నీతిమాలిన రాజకీయాలు చేయాలని చూస్తే టిడిపి ,జనసేన లను తరిమి తరిమి కొడతాం…వైసీపీ నాయకులతో మంచికి మంచి ఉంటుంది, చెడుకు చెడు ఉంటుందన్నారు. గతంలో మహిళా పార్లమెంటుకు పిలిచి చంద్రబాబునాయుడు నన్ను అవమానించాడు… ఇదే మాచర్లలో పోలీసుల పేరు అడ్డు పెట్టుకుని వేధించాడు… అలాంటి నన్ను ఇదే మాచర్ల గడ్డపై పోలీస్ సెక్యూరిటీతో మంత్రిని చేశాడు సీఎం జగన్..అధికారాన్ని వదిలిపెట్టి జగనన్న వెంట నడిచిన సైనికుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మాలాంటి నాయకులకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక ఇన్స్పిరేషన్ అన్నారు మంత్రి రోజా.
Read Also: Uniform Bites By Rats: హవ్వ.. యూనిఫాం ఎలుకలు కొరికేశాయట..
తాజావార్తలు
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!