మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం జీడిపాకంలా సాగుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ రావటంతో అనుకున్న సమయానికి నిర్వహించలేక పోయింది ప్రస్తుత కమిటీ. దీంతో రకరకాల వివాదాలతో సభ్యుల వ్యాఖ్యలతో ప్రజలలో చులకనువుతూ వస్తోంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ లోగా మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ తన కమిటీతో పోటీ సిద్ధం అని ప్రకటించటం… మంచు విష్ణు, జీవిత, హేమ వంటి వారు తాము కూడా అధ్యక్షపదవికి పోటీ చేస్తామని ప్రకటించటం…