ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా జరిగిన వేవ్స్ (వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్) సమ్మిట్, భారతదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో వినోద రంగంలో కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో నిర్వహించబడింది. మే 1వ తేదీన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై, భారతీయ చిత్ర పరిశ్రమ యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటారు. ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్, మహవీర్ జైన్ ఫిల్మ్స్‌తో కలిసి 9 కొత్త సినిమా ప్రాజెక్టులను నిర్మించనున్నట్లు ఒక…