Lunar Eclipse: నిత్యం భక్తులకు కిటకిటలాడే ప్రముఖ ఆలయాలు సైతం.. గ్రహణం వచ్చిందంటే మూతపడతాయి… అది సూర్య గ్రహణం అయినా, చంద్రగ్రహణం అయినా.. గ్రహణ సమయానికి ముందే మూసివేసి.. ఆ తర్వాత శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాతే పూజలు, అభిషేకలు నిర్వహిస్తారు.. దర్శనాలకు భక్తులను అనుమతిస్తారు. అయితే, శ్రీకాళహస్తిలో మాత్రం దీనికి భిన్నంగా.. గ్రహణ సమయంలోనూ ఆలయం తెరిచే ఉంటుంది.. గ్రహణ సమయంలో శ్రీకాళహస్తీ వాయులింగేశ్వర స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహిస్తారు. భక్తులు స్వామి అమ్మవార్లను…