లుధియానా కోర్టు పేలుళ్ల కేసులో…సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయ్. మాజీ కానిస్టేబుల్…తన మీద నమోదైన కేసుల ఫైళ్లను కాల్చేసేందుకే…ఈ కుట్రకు పాల్పడినట్లు విచారణలో తేలింది. గగన్ దీప్‌కు…డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. పంజాబ్‌లో కలకలం సృష్టించిన లుథియానా జిల్లా కోర్టులో బాంబు పేలుడు ఘటనలో ఆసక్తికర అంశాలు బయటపడుతున్నాయ్. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని.. 2019లో డిస్మిస్ అయిన హెడ్ కానిస్టేబుల్ గగన్‌దీప్ సింగ్‌గా గుర్తించారు. ఘటనాస్థలంలో మొబైల్ సిమ్‌కార్డు, వైర్‌లెస్ డోంగిల్‌ను…