Hyderabad Rains : హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. జలమయమైన రోడ్లు..!
- హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం
- జలమయమైన రోడ్లు.. ట్రాఫిక్‌కు అంతరాయం
- తెలంగాణకు ఐదు రోజుల వర్ష సూచన
- పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Rains : హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శనివారం (జూన్ 6) ఉదయం నుండి భానుడు తన ప్రతాపం చూపిస్తూ, వాతావరణం ఎండ తీవ్రతతో పొడిగా ఉన్నప్పటికీ.. మధ్యాహ్నానికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆకాశాన్ని ఒక్కసారిగా నల్లటి మబ్బులు కమ్మేసి, నగరం అంతటా దంచికొడుతూ వర్షం కురిసింది. ఈ ఆకస్మిక వర్షంతో గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో మండిపోయిన భాగ్యనగరం ఒక్కసారిగా చల్లబడింది.
నగరవ్యాప్తంగా వాన జల్లులు.. జలమయమైన రోడ్లు
హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రాంతాలైన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్, రాజేంద్రనగర్, అత్తాపూర్, బండ్లగూడ, హిమాయత్ సాగర్, కిస్మాత్ పూర్ పరిసరాల్లో కూడా వాన దంచికొట్టింది. మరోవైపు బషీర్ బాగ్, అబిడ్స్, నారాయణగూడ, నాంపల్లి, కోఠి ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రతను తట్టుకోలేక ఇబ్బంది పడ్డ వాహనదారులు, ఒక్కసారిగా వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో ఈ చిరుజల్లులను ఆస్వాదిస్తూ కనిపించారు. అయితే, వర్షం ఎక్కువగా కురిసిన కొన్ని ఏరియాల్లో ప్రధాన రోడ్లు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగి జలమయమయ్యాయి.
Also Read
- Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
- KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
తెలంగాణకు మరో ఐదు రోజులు వర్ష సూచన
ఇదిలా ఉండగా, తెలంగాణ వ్యాప్తంగా రాబోయే ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ తెలంగాణ ప్రాంతంతో పాటు దానిని ఆనుకుని ఉన్న తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, యానాం పరిసరాల్లో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
ఈ జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక.. అప్రమత్తంగా ఉండాలి
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ముఖ్యంగా రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వీటితో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. అందువల్ల ప్రయాణికులు, వాహనదారులు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
తాజావార్తలు
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?