‘కె.జి.ఎఫ్’ సీరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా ఇమేజ్ సంపాదించుకున్న కన్నడ స్టార్ యశ్. దీంతో యవ్ నటించిన కన్నడ చిత్రాలను ఇతర భాషల్లో అనువదించి విడుదల చేస్తున్నారు. అలా వస్తున్న చిత్రమే ‘లక్కీస్టార్’. 2012లో కన్నడలో ‘లక్కీ’ పేరుతో విడుదలైన యశ్ సినిమాను ఆ చిత్ర నిర్మాత రాధికా కుమారస్వామి ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. రాధికా కుమారస్వామి సమర్పణలో శ్రీదుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ పతాకంపై రవిరాజ్ అందిస్తున్న ఈ సినిమాకు డా.సూరి…