విశాఖపట్నంలో నగరంలో నలుగురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపింది. ఈ మధ్య రిలీజ్ అయినా లక్కీ భాస్కర్ అనే మూవీ చూసిన విద్యార్థులు అందులో హీరో తరహాలో సులువుగా డబ్బులు సంపాదించవచ్చు.. కార్లు, ఇళ్లు కొనేసి తిరిగి వస్తామని స్నేహితుల వద్ద చెప్పి హాస్టల్ నుండి పరారయ్యారని తెలుస్తోంది.. మహారాణి పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది..