తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ తెలుగు నిర్మాతలందరినీ అక్టోబర్ వరకూ తమ చిత్రాలను ఓటీటీలో విడుదల చేయవద్దంటూ కొంతకాలం క్రితం కోరింది. కానీ వారి మాటను కాదని ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు ‘నారప్ప’ చిత్రాన్ని ఓటీటీలోనే విడుదల చేశారు. తాజాగా నాని సినిమా ‘టక్ జగదీశ్’ సైతం అతి త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోందని వార్తలు వచ్చాయి. విశేషం ఏమంటే… నాగ చైతన్య హీరోగా నటించిన ‘లవ్ స్టోరీ’ మూవీని ఆ చిత్ర…