Priyanka Chopra: వేలంటైన్స్ డేని తాము బుక్ చేసేసుకున్నామని ప్రియాంక చోప్రా చెప్పేసింది. అది తన భర్త నిక్ జోనాస్ తో కాదు సుమా, స్కాటిష్ యాక్టర్ శామ్ రొనాల్డ్ హ్యూఘన్ తో! విడ్డూరంగా లేదూ అంటారా- ఏం కాదు, ప్రియాంక, శామ్ కలసి నటించిన 'లవ్ ఎగైన్' సినిమా ట్రైలర్ రిలీజ్ సందర్భంగా వేలంటైన్స్ డేను ఎంచుకున్నారు వీరు.