నిన్న సోనమ్-రఘువంశీ…నేడు ఐశ్వర్య-తేజేశ్వర్…ఒకటా రెండా…దొరికిపోతామనే భయం లేదు. చేసేది తప్పనే సోయి లేదు. ఎంతకైనా బరి తెగిస్తున్నారు. కట్టుకున్న భర్తలనే లేపేస్తున్నారు. చంపటమే పరిష్కారం అనుకుంటున్నారు. కొందరు భార్యల్లో క్రూరత్వం పెరిగిపోతోంది. రాక్షస భార్యల గురించి చెప్పుకుంటూ…పోతే హిస్టరీ చాంతాడంత ఉంది. మెజారిటీ మర్డర్ కథల్లో ఇప్పుడు భార్యే హంతకురాలు…భర్తే హతుడు. అందంగా తయారై పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. కల్యాణమండపంలో…తలవంచి భర్తతో మూడు ముళ్లు వేయించుకుంటున్నారు. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల ముందు…మహానటిలా నటిస్తూ…ఎంతో సంతోషంగా నాలుగడుగులు వేస్తున్నారు. పెళ్లి…