కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రోడ్డు భద్రతా చట్టాన్ని సాకుగా చూపించి ఫిట్‌నెస్ ధ్రువీకరణ ఆలస్యమైతే రోజుకు రూ.50 జరిమానా విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 19న ఒక రోజు ఆటో, క్యాబ్, లారీల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ వెల్లడించింది. ఈ మేరకు హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో బంద్‌కు సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. కౌంటర్ సిగ్నేచర్ పర్నిట్ ( సింగిల్ పర్మిట్ ) దేశంలోని ప్రతి రాష్ట్రం పొరుగు రాష్ట్రానికి ఇస్తున్నట్లుగా…